Smpeta Water Issue

TDS_Machine.PNGపంచాయితీ వారు ,పాలకులు -గ్రామ ప్రజల ప్రాణాల్ని కలుషితమైన నీళ్లకొదిలేశారా? పరిశోధనలు చెప్పే సమాధానం -అవును.

వేరే వూరు నుండి దాహంతో ఇంటికొచ్చిన బంధువుకి లోటా నీళ్లు ఇస్తే ,నోట్లో పోసుకున్న నీళ్ళని భళ్ళున ఊసి “ఈ నీళ్లెలా తాగుతున్నార్రా?” అని భయపడిపోయాడాయన.
“ఈ ఊరికి పెళ్ళై కాపురానికొచ్చాక నేను నల్లబడిపోయా” ఒక కొత్తకోడలు బాధ.
మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు ఇంటికొకరు. వాళ్ళ వయసు నలభై కూడా దాటదు.
కుర్రాళ్లలో కూడా కొందరికి ఒళ్ళు నొప్పులు.
“మిల్క్ టేస్ట్ అదోలా ఉన్నాయని,అందుకే తాగనని” అప్పుడప్పుడు చెప్తుంది మా పెద్దమ్మాయి.
అందరూ మా ఖర్మ అని సరిపెట్టుకుపోతున్నారు.
ఊళ్ళో యాభై ఐదేళ్ల మహిళ అంతుచిక్కని వ్యాధితో బాధపడింది.దాదాపు కోమా స్టేజి.టౌన్ కి తీసుకెళ్లి అనేక పరీక్షలు చేసి,రెండున్నర లక్షలు ఖర్చు అయినా తరవాత డాక్టర్లు చెప్పిన మాట – మీరు తాగుతున్న నీళ్లు కలుషితం. అందుకే మీకీ సమస్య.
కిడ్నీ వ్యాధులతో ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు.
లక్షలు ఖర్చుపెట్టి డయాలసిస్ చేయించి,అయినా ప్రాణాలు దక్కక -ఆర్ధికంగా,మానసికంగా దెబ్బతిన్న కుటుంబాలు కూడా వున్నాయి.
***************
ఈ సమస్య ఉందని జనాలు గుర్తించి,బాధపడుతున్నా,గ్రామంలోని సీపీఎం పార్టీ వాళ్ళు ముందడుగు వేసి,గ్రామంలో కిడ్నీ,ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్ళ సమాచారంతో “పశ్చిమ కృష్ణకి ఏమైంది?” అనే పేపర్ వార్త ద్వారా జనాల్లోకి తీసుకొచ్చి చైతన్యం కలగజేశారు. బాధితులకి వైద్య సహాయం అందించాలని,పింఛను ఇవ్వాలని ప్రభుత్వాల వారికి విజ్ఞప్తి చేశారు. వారికి ధన్యవాదాలు.
****************
గ్రామపంచాయితీ వారు నీటి వనరులని పరిశీలించి,వైద్యాధికారి ద్వారా – గ్రామంలో ఒక వ్యక్తికి మాత్రమే డయాలసిస్ జరుగుతుందని సమాచారం సేకరించారు. ఇతర అధికారులు,వైద్యులు-గ్రామంలో కిడ్నీ సమస్యలపై జరుగుతున్న ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని,వ్యక్తిగత అలవాట్లవల్లే ఈ సమస్య వస్తుందని తెలియజేసారు.
****************
ఈ వార్త మీద గ్రామస్తుల మధ్య విస్తృత చర్చ జరిగింది.మనం కూడా పరీక్ష చేసి మరిన్ని వాస్తవాలు సేకరించాలని ప్రయత్నాలు జరిగాయి.కిడ్నీ సమస్యలు రావటానికి కలుషిత నీళ్లు కూడా ఒక కారణమే.
మంచి నీళ్లు అందించే వనరులు:
1. చెరువు పక్కన గల మంచి నీళ్ల బావి
2. గండ్రాయి రోడ్డు పక్క,ఆంజనేయస్వామి గుడి దగ్గర 2 సంవత్సరాల క్రితం వేసిన బోరు బావి
3. అడ్డ రోడ్డు లో గల బోరు బావి

గతంలో వందల సంవత్సరాలుగా లేని సమస్యలు ,ఈ మధ్య కాలంలోనే ఎందుకు వచ్చాయి?
ఆంజనేయస్వామి గుడి దగ్గర 2 సంవత్సరాల క్రితం వేసిన బోరు బావి నీళ్లు తాగటానికి పనికి రావు.
వాటి టీడీఎస్ 909 వుంది.
ఆ నీళ్లు మంచినీళ్ల బావిలోకి పైపుల ద్వారా పంపి వాటిని గ్రామ ప్రజలకి తాగునీటి సరఫరా చేస్తున్నారు.
నిజానికి చెరువు బావి నీళ్లు తాగటానికి అనుకూలమైనవి.బోరు బావి నీళ్లు అందులో కలపడం వల్ల వాటి టీడీఎస్ కూడా 909 వుంది.
అడ్డరోడ్డు బోరు నీళ్లు టీడీఎస్ 900. ఇవి కూడా తాగటానికి పనికి రావు.

TDS లెవెల్స్ ఎంతుండాలి?
300 ల లోపు -ఎక్సలెంట్
300-600 :గుడ్
600-900: ఓకే
900-1200:పూర్
1200 -ఆ పైన : డేంజర్

అధికార పక్షం వాళ్ళు ఇస్తున్న సలహా ఏమిటి?
-మేం బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నాం. నీళ్లు బానే వున్నాయి.
-తక్కువ ఖర్చుతో అందిస్తున్న మినరల్ వాటర్ కొనండి.
-మొదట్లో కాళ్ళ నొప్పులు వచ్చినా నిదానంగా అలవాటు అయిపోతుంది అని.
-అధికార పక్షం వాళ్ళవి రెండు మినరల్ వాటర్ ప్లాంట్స్ వున్నాయి.
-త్వరలో కృష్ణా నదీజలాలు మన గ్రామానికి రాబోతున్నాయి. వస్తే మంచిదే. ఎప్పుడో రాబోయే వాటి కోసం ఎదురు చూడటం కంటే – మనకున్న మంచి నీటిని శుభ్రం చ్చేసుకోవడం తెలివైన పని.

మినరల్ వాటర్ మంచివేనా?
నీళ్ల ప్లాంట్స్ నడిపేవాళ్ళకి బాగా ఆదాయం బాగా వస్తుంది.
కెమికల్స్ ఎలా కలపాలి అనే విషయంపై వాళ్లకి అవగాహన సరిగ్గా ఉండకపోవచ్చు. అవి వాసన కూడా వస్తున్నాయి.
అందులో వాడే కెమికల్స్ వలన ఎముకలు అరిగిపోవడం ,కీళ్ల సమస్యలు,నొప్పులు వస్తాయని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.
దీనికి పరిష్కారం ఏంటి?
1. ముందుగా బోరు బావి నీళ్లని చెరువు బావిలోకి పంపింగ్ చేయడం ఆపేయాలి.
2. చెరువు పక్కనే ఉన్న రెండు పాతబావుల పూడిక తీసి,వాటిని కూడా మంచినీళ్ళకి వాడాలి.
3. గ్రామస్తులు అందరూ నల్లి (టాప్) వాడాలి. దాని ద్వారా నీళ్లు వృథా కాకుండా అరికట్టొచ్చు.నల్లి వాడని వాళ్లకి పంచాయితీ వాళ్ళు ఫైన్ వెయ్యాలి.
4. “తాగు నీటిని”,”ఇతర వాడకానికి వాడే నీళ్ళని” విడివిడిగా సరఫరా చెయ్యాలి.
5. ప్రతి 3 నెలలకి ఒకసారి నీళ్ళని పరీక్షలు చెయ్యాలి.
********
నీళ్ళని టెస్ట్ చేసిన వ్యక్తి సోదరుడు బరిగెల వినోద్ కుమార్ .అతను ,వాళ్ళ కుటుంబం మొత్తం కలుషిత నీళ్లకి బాధితులే అని – అతనే స్వయంగా నీటిని టెస్ట్ చేసాడు. అతనికీ,అతనికి కొంచెం సహకారం అందించిన జూనెబోయిన మురళి కి కృతజ్ఞలు.
పిక్చర్స్ ని పోస్ట్ లో చూడొచ్చు.
**********
పంచాయితీ వారికీ విన్నపం – ఇది అర్జెంటు,టాప్ మోస్ట్ సమస్య గా గుర్తించి వెంటనే సమస్యని సమూలంగా నిర్మూలించాలి.దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు.
ఇంకా ఎంతోమంది ప్రజల ఆరోగ్యం దెబ్బతిని ,జననష్టం జరిగితే ప్రజల ఆగ్రహానికి గురవుతారు.
***
ఇది ఊరిలొ ఉన్న ప్రతి ఒక్కరి సమస్య. దీనికి మనం బాధితులం కాకముందే – ఇది పూర్తిగా సమసిపోయే దాకా ప్రజలందరూ పార్టీలని పక్కనబెట్టి కలిసికట్టుగా ఉద్యమించాలి.అప్పుడే మన ప్రాణాలని కలుషిత నీటి నుండి కాపాడుకున్నవారం అవుతాము.

Smpet_Issue.PNGhttp://www.bestwaterpurifierindia.com/acceptable-tds-level-drinking-water/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.